సాదాసీదాగా సాగిన మండల సర్వసభ సమావేశం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత
మల్దకల్ డిసెంబర్ 5 (జనంసాక్షి)మండల సర్వ సభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది.సోమవారం జరిగిన ఈ సమావేశానికి ఎంపీపీ వై రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు.ఈ సందర్భంగా సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా ముందుగా వైద్యం ఆరోగ్యం పై ప్రగతి నివేదికను డాక్టర్ చదివి వినిపించారు.ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించాలని గౌరవ సభ్యులకు సూచించారు. పంచాయతీరాజ్ పై ప్రగతి నివేదికను చదివి వినిపించగా పెద్దోడి గ్రామంలో సిసి రోడ్లకు బిల్లు రాలేదని ఎంపిటిసి సభ్యుడు రాజు లేవనెత్తారు. గ్రామ సర్పంచ్ తీర్మానం తీసుకొని బిల్లులు డ్రా చేసుకోవాలన్నారు.అన్ని గ్రామాల సర్పంచులకు సిసి రోడ్లు బిల్లులు రావడం జరిగిందని ఏఈ భరత్ కుమార్ సమావేశంలో వివరించారు. అన్ని శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సరిత మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు అభివృద్ధి పరుస్తామని జిల్లా పరిషత్ నుండి నిధులు కేటాయించి జెడ్పిటిసి నిధుల ద్వారా గ్రామాభివృద్ధి చేసుకోవాలన్నారు.దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధికి ఎలాంటి అవసరం వచ్చిన తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చినట్లైతే ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండి సహకరిస్తానని హామీ అన్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఏర్పరచుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా దేయంగా పనిచేస్తుందని,నిత్యం పనిచేస్తుందన్నారు.సభ్యులు కూడా అధికారులకు సహకరించాలని ఆమె అన్నారు.ఎల్కూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలోని కోడిగుడ్లు పంపించడం లేదని కోఆప్షన్ సభ్యుడు హైదర్ అలీ సమావేశంలో లేవనెత్తారు. ప్రజా ప్రతినిధులు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీలు చేసి మధ్యాహ్న భోజన పథకంలో పనితీరుపై వారానికి రెండు రోజులు తనిఖీలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ సభ్యులకు సూచించారు.ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, ఎంపీడీవో కృష్ణయ్య ,అగ్రికల్చరల్ ఏడి సంగీత లక్ష్మి సంభందిత శాఖ అధికారులు ఎంపిటిసిలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.




