మునిపల్లి, జూన్ 03, జనంసాక్షి : రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. శనివారం నాడు మునిపల్లి మండలంలోని పెద్దలోడి గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు భరోసానిస్తూ రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ చేస్తోందని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ చేపట్టిందన్నారు. దింతో జిల్లాలో మూడు రెట్లు సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి అత్యధికంగా పెరిగిందన్నారు. ముందస్తు సాగుపై రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులుతో చర్చించి సందేహాలను నివృత్తి చేసుకుంటూ లాభదాయక సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. అనివార్యకారణాలతో రైతులు సహజ మరణం పొందితే, వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ. 5 లక్షలు రైతుబంధు పథకం కింద అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతని అందిపుచ్చుకొని
వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనూ రాణించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరిస్తూ రైతులకు చదివి వినిపించారు. అంతకు ముందు రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్లబండిపై ఊరేగింపుగా ర్యాలీ తీస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి అశోక్, ఎంపీటీసీ రేణుక వెంకటేష్, లక్ష్మీ నగేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామాచారి, ఎంపీవో అంజనీ దేవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మండల అధ్యక్షులు విజయ్, మునిపల్లి సర్పంచ్ రమేష్, చిన్నచెల్మెడ సర్పంచ్ విజయ్ భాస్కర్, నాయకులు సతీష్, నాయరాయణ, యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు, రైతులు, రైతు మహిళలు, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మునిపల్లి క్లస్టర్ లో వ్యవసాయ అధికారి శివకుమార్, బుదేరాలో జడ్పీటీసీ పైతర మీనాక్షి, కంకోల్ ఎంపీపీ శైలజా ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. రైతు వారోత్సవాల్లో రైతులు డప్పు చెప్పుల్లమధ్య ఎడ్లబండ్లపై ఊరేగింపుగా నిర్వహించారు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది – జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్




