లింగాల జనం సాక్షిలింగాల రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దపీట వేశారని సింగిల్ విండో చైర్మన్ జమ్ముల హనుమంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మండల పరిధిలోని కోమటికుంట గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా కోమటికుంట క్లస్టర్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ జమ్ముల హనుమంత రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రాధాన్యతనిస్తూ రైతు బీమా రైతుబంధు రైతులకు సబ్సిడీ తక్కువ ధరకే ఎరువులు అందించడంతోపాటు రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడి బచ్చన్న వార్డు సభ్యులు సుల్తాన్ ఎంపీటీసీ ఎంపీడీవో గీతాంజలి ఆర్ఐ ఏఈఓ నరేష్ కార్యదర్శి సైదుబాబు రైతుబంధు అధ్యక్షుడు దయానందం పార్టీ ఉపాధ్యక్షులు బుచ్చయ్య మండల అధికార ప్రతినిధి గుడి శ్రీనివాసులు పి.హనుమంత్ రెడ్డి కమలాకర్ వేణు. ఖాజ రాజేష్ లింగారెడ్డి పరశురాం దేవేందర్ వివిధ గ్రామాల యువకులు మహిళ సంఘం అధ్యక్షురాలు విమలమ్మ కమలాకర్ వివిధ గ్రామాల నుండి గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు రైతుల పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట – సింగిల్ విండో చైర్మన్ జమ్ముల హనుమంత రెడ్డి




