Wednesday, 4 November 2026

రైతుల ఆందోళన

కరీంనగర్‌, నవంబర్‌ 3 : నీలం తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలోని సుమారు వరి ధాన్యం 20వేల క్వింటాళ్లు, పత్తి 30 వేల క్వింటాళ్లు పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. గతంలో పంటలు వేసేందుకు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని వారు కోరుతున్నారు. సబ్సిడీపై విత్తనాలను, ఎరువులను ప్రభుత్వం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. మెట్టభూముల్లో పండించే పంటలైన పెసర, శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *