Wednesday, 4 November 2026

‘నీలం’ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌, నవంబర్‌ 3 : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌లోకి నీరు చేరడంతో కార్మికులు బొగ్గు తవ్వేందుకు అంతరాయం కలిగింది. సింగరేణి కాలనీ యాజమాన్యం స్పందించి ఓపెన్‌కాస్ట్‌లోని నీటిని వెలుపలకు పంపింగ్‌ చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం వాటిల్లింది. వర్షాలు తగ్గుముఖం పడితే కానీ ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తికి వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *