Wednesday, 4 November 2026

రైతుల క్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్వేయం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ జూన్ 23 (జనం సాక్షి)
రైతుల క్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ రైతు వేదిక*లో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా సీడ్స్ పంపిణీ చేశారు.
అడ్వకేట్స్ తో రైతు హక్కులపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రామ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కామారెడ్డి ఎంపిఓ నాగరాజ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.