Wednesday, 4 November 2026

రైతు బంధు ఇస్తున్నా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి

 

 

 

 

 

 

 

 

-ఆత్మహత్యల నివారణ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.-టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి 9(జనంసాక్షి):రైతుబంధు లాంటి పథకాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ ప్రశ్నించారు.గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రైతే రాజు అని చెప్పుకొనే ప్రభుత్వాలు రైతులను ఇంకా కూలిలుగానే చూస్తున్నారని విమర్శించారు.స్వాతంత్ర్యం వచ్చి75 సంవత్సరాలు అవుతున్నా రైతులకు మోసం చేయడం తెలియదు ప్రజలకు అన్నం పెట్టడం తప్ప అలాంటి రైతులను ఈ ప్రభుత్వాలు మోసపూ బీసీరిత మైన మాటలతో మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు రైతులు వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు లేక పెద్ద పెద్ద పట్టణాలలో గుమస్తాలుగా గేట్ కీపర్లుగా పనిచేస్తున్నారని రాబోయే రోజుల్లో రైతు పంట పండించకపోతే మానవ మనుగడకే చాలా ముప్పు రైతులు పంట పండిస్తే గాని మనం మూడు పూటలు అన్నం తినలేని పరిస్థితి అలాంటి రైతులకు ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ కూడా మాఫీ చేయలేదు రైతు పంట పండిస్తే కానీ మనం బ్రతకలేని పరిస్థితి అని అన్నారు. అలాంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజల కొరకు ఎంతో కష్టపడి పండిస్తే అలాంటి సమయంలో నాసిరకమైన విత్తనాలతో రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.