రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్. అలంపూర్ జనం సాక్షి నవంబర్ 30 పేదల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతు రాజ్యం వస్తుందని, అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర బుధవారం మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి త్వరలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, ధరణి పోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి లబ్ధిదారులను అదే తెచ్చి సంపత్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఐదువేల రూపాయలు రైతుబంధు ఇస్తూ ఎకరాకు యాభై వేల రూపాయల పంట నష్టం వచ్చే విధంగా ప్రభుత్వంనకిలీ విత్తనాలను అమ్మే కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకుంటూ, నకిలీ విత్తనాలను రైతులకు అమ్మి నష్టం చేస్తు చేస్తున్న కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. ఈ ధరణి వలన రైతుల సమస్యలను పరిష్కరించకపోవడంతో, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ఒక్కసారే ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు,యూరియా విత్తనాలు, ధరలతోపాటు నిత్యవసర సరుకులు ధర లు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ధరణి పోర్టును కాంగ్రెస్ పార్టీ ఈ ఇతర రిపోర్టును రద్దు చేసే విధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఈ ధరణి పోర్టును రద్దు చేయాలని చేయాలని వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్లకు ధరణి పోర్టు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర మొత్తంగా అన్ని నియోజకవర్గ స్థాయిలో తాసిల్దార్ లకు వినతిపత్రం సమర్పించడం జరిగిందని అని అన్నారు. రైతులు రాజుగా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని, ఆయన అన్నారు. ఈ ధర్నాలో వార్డ్ కౌన్సిలర్ ఇంత్యాయాజ్,అలంపూర్ తాలూక యువ నాయకులు రవి, మాజీ ఇటిక్యాల మండలం అధ్యక్షులు నరసింహ, సోమిరెడ్డి,నియోజవర్గంలోని మండలాధ్యక్షులు, మాజీ ఎం పిటిసిలు, సర్పంచ్ లు కార్యకర్తలు ప్రభాకర్, సంపత్, తదితరులు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్




