రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంది

కాసిపేట, 12 (జనం సాక్షి):రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుతును అందిస్తున్నామని ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో ఉచిత కరెంటుపై వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను స్థానిక నాయకులతో కలిసి దహనం చేశారు. ఒకవైపు తమ ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలను విధిస్తామని బహిరంగంగానే అధ్యక్షుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బారస మండల అధ్యక్షులు రమణారెడ్డి ఎంపీపీ లక్ష్మి జెడ్పిటిసి చంద్రయ్య వైస్ ఎంపీపీ విక్రం రావు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య మండల నాయకులు దుర్గం పోశం లంక లక్ష్మణ్ మోటూరు వేణు రామ్ టైంకి వాసుదేవ్ అగ్గి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు