ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు నేడు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ర్టానికి రైల్వే మార్గాల సర్వేకు మాత్రమే మంత్రి కనికరించారు. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నుంచి వరంగల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్‌కు అదేవిధంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని కిరండోల్ ల మధ్య కొత్త రైల్వే లైన్‌కు సర్వే చేపట్టనున్నారు.




