Tuesday, 3 November 2026

రౌడీ షీటర్‌ను నరికిచంపిన ప్రత్యర్థులు

నల్లగొండ : నల్లగొండ పట్టణం బీటీయస్‌లో కరుడు గట్టిన రౌడీషీటర్ యూసూఫ్‌ను ప్రత్యర్దులు కిరాతకంగా నరికి చంపారు. అర్థరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న యూసూఫ్ కంట్లో కారం చల్లి వేటకొడవళ్లు, తల్వార్ లతో దాడి చేయడంతో తను అక్కడికక్కడే చనిపోయాడు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో యూసూఫ్ నాలుగు హత్య కేసుల్లో నిందితుడు. పోలీసులు యూసూఫ్ ను పట్టణ బహిష్కరణ చేశారు. పోలీసులు కళ్ళు కప్పి పట్టణంలో ఉంటున్న సమయంలో హత్యకు గురయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *