హైదరాబాద్: శంషాబాద్ రైల్వే స్టేషన్ లో పిడుగుపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు కుండపోతగా వర్షం కురుస్తుండగానే శంషాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పై పిడుగు పడిరది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు శంషాబాద్ మండలానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు ఇడిశా వాసులు. వీరిలో ఏడాది వయసున్న బాలుడు ఉన్నాడు.




