Thursday, 5 November 2026

రోగులను కంటికి రెప్పలా కాపాడే నర్సు ఉద్యోగం చేయడం అదృష్టం. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, మే 12 (జనం సాక్షి);రోగులను 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడే నర్సు ఉద్యోగం చేయడం అదృష్టమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శుక్రవారం ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సింగ్ డే సందర్భంగా నర్సింగ్ కోర్స్ నేర్చుకుంటున్న నర్సులకు అభినందనలు తెలిపారు. నర్సుల వృత్తి పవిత్రమైనదని, ఎక్కడ నర్సింగ్ బాగుంటుందో అక్కడ ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. డాక్టర్లు సర్జరీ చేశాక పేషంటును 24 గంటలు జాగ్రత్తగా చూసుకునే నర్సులు చేసే సేవ అమోఘమైనదని కలెక్టర్ తెలిపారు. నర్సులకు రోగులనుండి యాజమాన్యం నుండి ఒత్తిళ్లు వచ్చినా అను కువతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. నర్సింగ్ కళాశాలలో స్టడీ క్లాసెస్ అర్థం చేసుకుని ప్రాక్టికల్ గా నేర్చుకోవాలన్నారు. అర్థం చేసుకునే వయసు కాబట్టి నర్సింగ్ లో ఉన్న మెలకువలు నేర్చుకుని జీవితంలో పైకి రావాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన నర్సువృత్తి న్యాయం చేసేలా విధులు నిర్వహించాలన్నారు. ఈసందర్బంగా ప్లో రెన్స్ నైటింగేల్ చిత్ర పటానికి పూలమాల వేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హృషాలిని, డాక్టర్ శశికళ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమల,ఇందిర కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.