మోత్కూరు నవంబర్ 7 జనంసాక్షి : మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు అనేక ప్రలోభాలు ఆశ చూపి కార్లు మోటార్ సైకిల్ కొని పెట్టి అవసరమైతే బంగారం పంచి మునుగోడు ఓటర్లను కొని గెలవాలని తీవ్ర ప్రయత్నం చేసి మోసపూరితమైన వాతావరణం సృష్టించిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు వాతలు పెట్టి తగిన బుద్ధి చెప్పారని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మతిభ్రమించిన రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ మోత్కూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రధాన రహదారిప్లై మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారాలకు పాల్పడుతూన్న రాజగోపాల్ రెడ్డికి కమ్యూనిస్టుల నీతి నిజాయితీలు ఏమి తెలుసునని కమ్యూనిస్టుల చరిత్ర తెలుసుకోవలంటే నీ తాత తండ్రులను అడిగి తెలుసుకోవాలన్నారు 18 వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి రాజకీయ బిక్ష పెట్టి ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులను ఇచ్చి ప్రజాప్రతినిధిగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకొని బహిరంగంగా కమ్యూనిస్టులకు క్షమాపణలు చెప్పాలని డబ్బులున్నాయని అహంకారపూరిత మాటలు మాట్లాడితే సహించబోమని గ్రామాలలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెడె చంద్రయ్య, చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీ నరసయ్య, గీతా పనివారాల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చాపల అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి అన్నేపు వెంకట్, పట్టణ కార్యదర్శి పులకర మల్లేష్ వ్యవసాయ కార్మిక సంఘం మోత్కూరు మండల అధ్యక్ష కార్యదర్శులు వల్లపు అంతయ్య, జిట్టా రాములు, రైతు సంఘం మండల కార్యదర్శి దొండ ఎల్లయ్య బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్ష కార్యదర్శులు పోచం కన్నయ్య, పెండెం వెంకటేశ్వర్లు, ఏఐటియుసి మండల అధ్యక్షులు జంగా నరసయ్య, ముష్పట్ల మాజీ ఎంపీటీసీ కొల్లూరు మల్లయ్య, దొండ రాములు తాడూరు లక్ష్మీ నరసయ్య, ఎండి పాషా రఫీ, పురుగుల రవి, రమేష్, బుర్ర శివ, మల్లేష్, బుర్ర రవి, పురుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం




