Tuesday, 3 November 2026

రోడ్డు నిబంధనలు పాటించాలి

 

 

 

 

 

జహీరాబాద్ జనవరి 28 (జనం సాక్షి ) రోడ్డు పై వెళ్లేటప్పుడు వాహనదారులు తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని జహీరాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ జయప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ పార్కు పక్కన, కేతకి సంగమేశ్వర విద్యాలయ భవనము. సమీపంలో డాడీస్ రోడ్ కార్యాలయం ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాడీస్ రోడ్ అనే యాప్ ద్వారా వాహనాలకు రక్షణ ఉంటుందని అన్నారు. ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చారి, అచుత్య రెడ్డి, రాయికోటి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.