Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం

శ్రీకాకుళం టీడీపీ సీనియర్‌ నేత పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రనాయుడు ప్రయాణిస్తున్న వాహనం ఆయిల్‌ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది.దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నాయకులు ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. ఆయనకు వెన్నుపూస, గుండె భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం 3:30 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఎర్రన్నాయుడుతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎర్రన్నాయుడు (1957-2012)

ఎర్రన్నాయుడు స్వస్థలం కోటబొమ్మాళి మండలం నిమ్మడ గ్రామం.

ఎర్రన్నాయుడు మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన కింజరావు దాలినాయుడు – కళావతమ్మ దంపతుల నలుగురు కుమారుల్లో పెద్ద కుమారుడిగా 23-02-1975న జన్మించాడు.

విద్యార్ధిస్థాయి నుంచి నాయకత్వ పటిమ అలవర్చుకున్న ఎర్రన్నాయుడు ఆంధ్ర యూనివర్శిటీ నుంచి న్యాయశాసంలో పట్టా తీసుకునన్నారు.

1983లో తొలిసారిగా టీడీపీ  నుంచి శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

1985లో టీడీపీ నుంచి హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందారు. 1989లో పార్టీ టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపోందిన ఎర్రన్నాయుడు 1996లో ఎంపీగా గెలుపొందారు. 1998,1999,2004 వరకు వరసగా ఎంపీగా గెలుపొందారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

2009 ఎన్నికల్లో కిల్లి కృపారాణిపై ఓటమి చెందారు.

ఎర్రన్నాయుడుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్‌లో చదువుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *