Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
గుడిహత్నూర్: అక్టోబర్ 31( జనం సాక్షి)మండలంలోని మేకలగండి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సంఘటన స్థలంలో మృతి చెందారు మరొకరికి త్రివ గాయాలయ్యాయి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ కు చెందిన వారు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు కారులో వెళ్తుండగా వెనుక ఉన్న లారీ కారును ఢీకొనడంతో ముందర ఉన్న కంటేనర్ ను ఢీకొని ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదంలో కారులో ఉన్న మసూద్ నగర్ కు చెందిన పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ సయ్యద్ రఫతుల్లా అహ్మద్(56), అతని పెద్ద కూతురు షాభియా హష్మీ(26), తమ్ముని కొడుకు సయ్యద్ వజహాద్(17)తో పాటు కేఆర్కే కాలనీ చెందిన డ్రైవర్ శంషోద్ధిన్(50) మృతి చెందారు మరో కూతురు జూబియా హష్మీ త్రివంగా గాయాలు కాగా ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ తరలించగ చికిత్స పొందుతుంది సోమవారం ఉదయం సంఘటన స్థలానికి సిఐ నైలు నాయక్ చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు మృతు దేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రెహేమాన్ ఖాన్ తెలిపారు