రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించిన కేటీఆర్
` మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి
హైదరాబాద్,నవంబరు 17(జనంసాక్షి):రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన మంచి మనసు చాటుకున్నారు. ట్విటర్‌లో ఎవరు సమస్య ఉందని చెప్పినా తక్షణం స్పందించి తన వంతు సాయం చేసే కేటీఆర్ ఈసారి .. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కేటీఆర్… గాయపడిన విద్యార్థులను గమనించి కాన్వాయ్ ఆపి కిందకు దిగారు. ప్రమాదం గురించి తెలుసుకుని బాధితులను తక్షణమే తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.