తూ.గో: రోడ్డు ప్రమాదాల్లో బాధితులను రక్షించేందుకు దేశంలో తొలిసారిగా జీపీఎస్ టెక్నాలజీని వాడబోతున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జీపీఎస్ వాహనం, అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాల్లో ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నామన్నారు. తూ.గో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తామని డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు, పవన్ కల్యాణ్ సభ, ముద్రగడ కదలికలు, సీఐడీ తాజా నోటీసులపై స్థానిక పోలీసులతో సమీక్ష నిర్వహించారు.




