రోడ్డు విస్తరణలో దర్గా తొలగింపు: ఉద్రిక్తత
కడప,నవంబర్2(జనంసాక్షి): కడప జిల్లాలోని మైదుకూరులో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. బద్వేలు రోడ్డులోగల దర్గాను నేషనల్ హైవే అధికారులు కూల్చివేశారు. దీంతో ముస్లింలు గురువారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. కాగా…. వీరి ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా దర్గాను కూల్చిన స్థలంలో ముస్లిం మహిళలు వేప మొక్కను నాటి జెండాను పాతి ఈద్గా నిర్మించేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మైదకూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మైదకూరుకు చేరుకుని పరిస్థితిని సవిూక్షిస్తున్నారు.