లంబడిపల్లి గ్రామపంచాయతీ ని పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్.
చెన్నూర్ మండలంలోని లంబడిపల్లి గ్రామాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి శానిటేషన్ మరింత మెరుగు పరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆలోత్ లక్ష్మిప్రియ, ఎంపీడీఓ శ్రీనివాస్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఉన్నారు.