లక్షలు డిపాజిట్‌ చేస్తే నష్టం..!!

 రూ.2.5 లక్షలలోపు డిపాజిట్‌ చేసేవారికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారికి పన్ను చెల్లించే వారి పరిధిలోకి రారని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే పన్ను పరిధిలోకి రాకపోయినా లక్షలు తమ ఖాతాలో డిపాజిట్‌ చేస్తే ఇతర ప్రయోజనాలు పొందే వారికి శఠగోపం తప్పదు. ముsmall_savings_-_bi_1192302e-1ఖ్యంగా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారు లక్షలు డిపాజిట్‌ చేస్తే దాన్ని పరిగణలోనికి తీసుకుని ఆ కార్డును రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో ఆ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలు పొగొట్టుకుంటారు. లక్షలు డబ్బులు ఉన్నవారు పేదవారు కాదన్న తర్కంతో తెల్లరేషన్‌ కార్డును రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి ఇతరులు ఎవరైనా తమ ఖాతాల్లో ఎక్కువ మొత్తాల్లో పాత నోటులు డబ్బు డిపాజిట్‌ చేసి విత్‌డ్రా చేసి ఇమ్మని అంటే ఎవరూ అలా చేయవద్దని సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది.