Tuesday, 3 November 2026

వందల సార్లు కాల్పులు

India Pakistanపాకిస్థాన్‌ను ఇండియన్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఏడుగురు పాక్ సైనికులను హతమార్చింది. బీంబెర్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని ఇండియన్ ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు ఇటీవలి కాలంలో అమరులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *