కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కొలంబోలోని సదరన్ ఫ్రావిన్స్లోని ఆయన ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆ ఇంట్లో రాజపక్సకు సంబంధించిన స్పోర్ట్స్ కారును కనుగొనేందుకు ప్రయత్నించి పోలీసులు విఫలమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకే రాజపక్స నివాసంపై దాడులు చేశామని, అయితే ఏవిధమైన ఆధారాలు దొరకలేదని పోలీసు అధికార ప్రతినిధి అజిత్ రోహానా తెలిపారు.
మరోవైపు పోలీసుల సోదాలపై రాజపక్స కుమారుడు, ఎంపీ నమల్ రాజపక్స స్పందిస్తూ ఒక విలాసవంతమైన కారు కోసం తంగల్లెలోని తమ ఇంటిపై దాడులు చేశారన్నారు. ‘పోలీసులు మా ఇంటిలో సోదాలు నిర్వహించడమే కాక మమ్మల్ని మానసికంగా హింసించారు. మా ఇంటిపై, మా బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. పోలీసులు మా సహాయకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కొంతమంది మాపై తప్పుడు సమాచారం అందించారు’ అని ఆరోపించారు.




