Wednesday, 4 November 2026

దోపిడికి కుట్ర : బీజేపీ నేతలు అరెస్ట్

దోపిడికి కుట్ర : బీజేపీ నేతలు అరెస్ట్

కొల్కతా: దోపిడికి పథక రచన చేసిన ఇద్దరు బీజేపీ నాయకులతోపాటు 27 మంది ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి… కోర్టులో హాజరుపరిచారు. 29 మందికి కోర్టు 9 రోజుల పాటు రిమాండ్ విధించింది.

పోలీసుల కథనం ప్రకారం… పశ్చిమ బెంగాల్లోని నయాగ్రామ్ పశ్చిమ బ్లాక్ అధ్యక్షుడు సుఖేందు పాత్ర, పశ్చిమ మిడ్నాపూర్లోని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరుదేందు పాత్రతో పాటు 27 మంది కార్యకర్తలను వద్ద ఆక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దోపిడికి వ్యూహారచన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు నేతలు, కార్యకర్తలను తనిఖీ చేయగా భారీగా ముందుగుండు సామాగ్రితోపాటు ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *