లచ్చగూడెం రేషన్ షాప్ సీజ్ డీలర్ పై కేసు నమోదు

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని లచ్చగూడెం గ్రామములో గల రేషన్ షాప్ నెంబర్- 3019011 రేషన్ షాప్ లో శనివారం ఆకస్మికంగా సివిల్ సప్లై ఇల్లందు డిటి మహేష్ తనిఖీ చేశారు. ఈ నెల సరఫరా చేయడానికి ఉండవలసిన రేషన్ బియ్యం కంటే 31.00 క్వింటాల్ బియ్యం తక్కువ గా ఉన్నందున షాప్ సీజ్ చేసి డీలర్ పై 6 ఏ క్రింద కేసు నమోదు చేశారు.