మునిపల్లి, జూన్ 09, జనంసాక్షి : కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా ఉంటుందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆందోల్ లోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మునిపల్లి మండలంలో 177 మందికి చెక్కులు అందించారు. మల్లికార్జునపల్లి, బుసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు కల్యాణలక్ష్మీ చెక్స్ వచ్చినందుకు సీఎం కెసిఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సర్పంచ్ విమలమ్మ, స్వప్న శశికుమార్, యువనాయకుడు కార్తీక్ కు ధన్యవాదములు తెలిపారు.
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ




