Wednesday, 4 November 2026

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాయికోడ్ జనం సాక్షి జనవరి 09 రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం జడ్పిటిసి, ఎంపీపీ ఆధ్వర్యంలో మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత నిరుపేదలైన ప్రజలు తమ పిల్లల వివాహాల సమయంలో అయ్యే ఖర్చులు వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తించిన కేసీఆర్ వివాహ సమయంలో ఎంతో ఆసరాగా ఉపయోగపడే కల్యాణ లక్ష్మి , షాది ముబారక్ వంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టి ఎంతో అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్ ఎంపీపీ మమత అశోక్. ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్. మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్ ప్రధాన కార్యదర్శి కే శంకర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీ మారుతి. మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పటేల్ వర్మ వైస్ ప్రెసిడెంట్ తుకారాం. సొసైటీ చైర్మన్ హనుమంతు.ఎమ్మార్వో ప్రభు లు. ఆర్ ఐ .శ్రీకాంత్. ప్రభాకర్ ఎంపిటిసిలు నిరంజన్ .పండరి. లక్ష్మీ విష్ణువర్ధన్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రవీణ్ కుమార్. .శంకర్ కృష్ణ హనుమంతు నాగర్జున . విఠల్. సంతోష్ కుమార్. మాజీ సర్పంచ్ రవి. మాణిక్యం. చంద్రశేఖర్. నరేష్ .బీసీ సెల్ అధ్యక్షులు అంజయ్య.యువ నాయకులు. అనిల్. ప్రశాంత్ పటేల్. కాశీ బసవరాజ్ పటేల్. తిరుమల శ్రీకాంత్ బాబురావు. తదితరులు పాల్గొన్నారు.