ముప్కాల్( జనం సాక్షి) జనవరి 21 శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ రీజియన్ మీటింగ్ లో బాల్కొండ ఫోర్ట్ నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు 5 బహుమతులు లభించాయి. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రథమ బహుమతి, హరిత హారం లో చెట్ల పెంపుదలకు ప్రథమ బహుమతి,డయాబెటిస్ క్యాంప్ నిర్వహణకు ప్రథమ బహుమతి, జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా పేద పిల్లలకు పుస్తకాలు పెన్నుల పంపిణీకి ప్రథమ బహుమతి,క్యాన్సర్ అవర్నెస్ కార్యక్రమానికి ప్రథమ బహుమతి లు లభించాయి. దానిలో భాగంగా ఇట్టి కార్యక్రమాలకు ప్రెసిడెంట్ భూస రత్నాకర్ కు ఉత్తమ అవార్డ్, సెక్రటరీ మరియు ట్రేసరర్ కు బహుమతులు లభించాయి.ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు భూస రత్నాకర్ సెక్రెటరీ వెంకట గిరి, ట్రేసరర్ సతీష్ మరియు సభ్యులు వెంకటేశ్వర్లు,పోశెట్టి,కళ్యాణ్ రాజేందర్,నరేందర్, నవీన్,గోవర్ధన్ పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రత్నాకర్ కు ఉత్తమ అవార్డ్




