ఎస్ఐ రమేష్ బాబు
కేసముద్రం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా మారగాని కృష్ణ
కేసముద్రం జులై 4 జనం సాక్షి/ సామాజిక సేవ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందిన లైన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఎస్సై రమేష్ బాబు అన్నారు.కేసముద్రం అభ్యుదయ రైతు సంఘం భవనంలో ఆదివారం రాత్రి కేసముద్రం,నెల్లికుదురు,మరిపెడ లయన్స్ క్లబ్ ల నూతన కమిటీల ఇన్ స్టాలేషన్ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (వీడీజీ-1) ఎన్.వెంకటేశ్వర్ రావు నూతన కార్యవర్గంచే ప్రమాణ శ్రీకారం చేయించారు.కేసముద్రం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మారగాని కృష్ణ, కార్యదర్శిగా లక్కాకుల సత్యనారాయణ, కోశాధికారిగా బొప్పిడి రామ్మోహన్ రెడ్డి, నెల్లికుదురు క్లబ్ పీఎస్టీలుగా వి.బాబ్జీ, జి.మల్లేష్, ఏం.లింగమూర్తి, మరిపెడ క్లబ్ పీఎస్టీలుగా వి.శ్రీపాల్ రెడ్డి, వి.సత్యనారాయణ, ఎ.సుధాకర్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలకు పోలీస్ శాఖ తరపున సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీజీ పోకల చందర్, ఆర్సీ ఆర్.వెంకన్న, జోన్ అడ్వైజర్ కె.చంద్రశేఖర్,ఎక్స్టెన్షన్ చైర్మన్ పి.కిరణ్ కుమార్, జడ్సీ యర్నం శ్రీరాములు, కాబినేట్ అడీషనల్ ట్రెజరర్ చిర్ర యాకాంతంగౌడ్,తాజా మాజీ పీఎస్టీలు బోగోజు నాగేశ్వరాచారి,గంజి వీరేందర్ రెడ్డి,చింతా కరుణాకర్ పాల్గొన్నారు.




