లారీలను విడిచిపెట్టిన ఆర్టీవో అధికారులు

ఏలూరు: పెదతాడేపల్లి శివారులో పట్టుకున్న తెలంగాణకు చెందిన లారీలను ఆర్టీవో అధికారులు విడిచిపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే నాని ఒత్తిడి మేరకు తెలంగాణకు చెందిన లారీలను ఆర్టీవో అధికారులు పట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అయితే తాము తెలంగాణ లారీలనే ఉద్దేశంతో పట్టుకోలేదని, అధిక లోడుతో వెళ్తున్న కారణంగానే పట్టుకున్నామని డీటీసీ వెంకటేశ్వరరావు తెలిపారు.