Tuesday, 3 November 2026

లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని హిమాయత్‌సాగర్‌ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై  నుంచి ఇటుక లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. కొంగర్ల నుంచి లింగంపల్లికి ఇటుక లోడ్‌తో వస్తున్న లారీ నిన్న రాత్రి హిమాయత్‌సాగర్‌ వద్ద అదుపుతప్పి 20 ఆడుగుల ఎత్తున్న ఔటర్‌రింగ్‌రోడ్డుపై నుంచి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడింది. ప్రమాదం అనంతరం మంటలు చెలరేగడంతో లారీలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒకరిని కొంగర్ల గ్రామానికి చెందిన గణేశ్‌గా గుర్తించారు. మిగతావారిని ఒడిశాకు చెందిన కూలీలుగా బావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *