సాలార్ ప్రేమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను ప్రారంభించిన మజ్లీస్ పార్టీ అధ్యక్షులు అత్తర్ అహ్మద్
జహీరాబాద్ డిసెంబర్ 25( జనం సాక్షి)
జహీరాబాద్‌లోని శాంతి నగర్ ఐ డి ఎస్ ఎం టి కాలని ఫాల్కన్ గ్రౌండ్‌లో సాలార్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్ ప్రారంభించారు ఇది సాలార్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ యొక్క రెండవ సీజన్ ఈ టోర్నమెంట్ లో మొత్తం 16 టీమ్ పాల్గొనడం జరిగింది. ప్రారంభ మ్యాచ్ లో గార్డెన్ సిసి మరియు సన్ స్టార్ మధ్య టాస్ వేసి మ్యాచ్ ను అత్తర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శులు మెుహిఉద్దీన్ ఘౌరీ, ఆమెర్ బిన్ అబ్దుల్లా వివిధ వార్డుల అధ్యక్షులు మహ్మద్ అయూబ్, షేక్ సద్దాం, సయ్యద్ మొహసిన్, సయ్యద్ రాషెద్, మహ్మద్ ముజీబ్, సయ్యద్ హుస్సేన్ నాయకులు ముహమ్మద్ షఫీ, ముహమ్మద్ షరీఫ్, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ వలీ, ముహమ్మద్ ఫయాజ్, నిర్వాహకులు సయ్యద్ అర్ఫాత్, తాజుద్దీన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
సాలార్ ప్రేమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను ప్రారంభించిన మజ్లీస్ పార్టీ అధ్యక్షులు అత్తర్ అహ్మద్




