Thursday, 5 November 2026

లింగగూడెం దేవతల గుట్ట ఆక్రమణల పై సర్వేకు తహసీల్దార్ ఆదేశాలు

లింగగూడెం దేవతల గుట్ట ఆక్రమణల పై సర్వేకు తహసీల్దార్ ఆదేశాలు

 

పెనుబల్లి, జనవరి 12(జనం సాక్షి)
పెనుబల్లి మండలం లింగగూడెం రెవిన్యూ లోని దేవతల గుట్ట అక్రమ తవ్వకాలు,ఆక్రమణల పై సర్వే నిర్వహించాలని పెనుబల్లి మండల తహసీల్దార్ రమాదేవి గురువారం మండల సర్వేయర్ కి ఆదేశాలు ఇచ్చారు, గుట్టలో 302 సర్వే నెంబరులో పోపూరి కన్​స్ట్రక్షన్​ కి ఇచ్చిన లీజ్​ భూములు కాకుండ అదనంగా ఆక్రమించి మట్టిని, వ్యర్ధాలను వేయడం పై తహసీల్దార్​ దేవతల గుట్టలో సర్వే చేయాలని సర్వేయర్​ కు ఆదేశాలు ఇచ్చారు. ఆంద్రా ప్రాంతానికి చెందిన గిరిజనేతరులు గుట్ట ప్రక్కన వున్న ఇనాం, ఏజెన్సీ భూములను కొనుగోలు చేసి తెలంగాణ పట్టదారు పాసుపుస్తకాలు పొంది రైతుబంధు పొందడం పై రెవిన్యూ అధికారులు విచారణ చేపట్టనున్నారు.