లీకేజీపై లొల్లి లొల్లి

` నీట్‌ వ్యవహారంపై లోక్‌సభలో దుమారం
` పరీక్షల విధానం మొత్తం ఒక ‘ఫ్రాడ్‌’గా మారింది
` అధికారపక్షాన్ని నిలదీసిన విపక్షనేత రాహుల్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్‌ లీక్‌ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. పశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, దేశంలో పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ’ఫ్రాడ్‌’గా మారిందన్నారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని లక్షలాది మంది ప్రజలు నమ్ముతున్నారని, విపక్షాల అభిప్రాయం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ’నీట్‌’ పరీక్షా పత్రం లీకేజీ అంశాన్ని రాహుల్‌ లేవనెత్తుతూ, పేపర్‌ లీక్‌పై మంత్రి తనను తప్ప అందరినీ నిందించారని అన్నారు. ’నీట్‌’ విషయంలోనే కాకుండా మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని యావద్దేశానికి స్పష్టంగా అర్ధమైందని, అయితే మంత్రి మాత్రం తనను తాను మినహాయించుకుని అందరినీ నిందించారని అన్నారు. అసలిక్కడ ఏమి జరుగుతోందో దాని మౌలిక సూత్రాలను కూడా ఆయన అర్ధం చేసుకున్నట్టు తనకు అనిపించడం లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అన్నారు. కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా పాసయ్యారని, విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఉన్నంతవరకూ విద్యార్థులకు న్యాయం జరగదని అన్నారు.నీట్‌ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానమిస్తూ, ప్రభుత్వం ఏదీ దాచిపెట్టడం లేదని, నిజానిజాలను సుప్రీంకోర్టుకు తెలియజేసిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు. కోర్టు ఇచ్చే ఆదేశాల గురించి మనం ఎదురుచూద్దామని చెప్పారు. ఈ ఏడాది మే 5న నీట్‌`యూజీ పరీక్ష జరిగినప్పుడు పాట్నాలో పేపర్‌ లీక్‌ చోటుచేసుకోవడం మినహా గత ఏడేళ్లలో ఎలాంటి పేపర్‌ లీకేజీలు లేవన్నారు. ప్రస్తుతం నీట్‌ పేపర్‌ లేకేజీ వ్యవహారంపై సీజేఐ నేతృత్వంలో విచారణ జరుగుతున్నందున వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. ఎన్‌టీఏ ఏర్పాటు చేసినప్పటి నుంచి 240కి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 5 కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.5 కోట్ల మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత సోమవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నీట్‌ అంశంపై మాట్లాడుతుంటే.. విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్‌ లీక్‌లపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తనను తప్ప అందరినీ నిందిస్తున్నారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘గత ఏడేళ్ల కాలంలో పేపర్‌ లీక్‌ జరిగిన దాఖలాలు లేవు. ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది‘ అని వెల్లడిరచారు. ఈ ప్రభుత్వం పేపర్‌లీక్‌ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు. ఇదిలాఉంటే.. కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి శతృఘ్న సిన్హా ఎంపీగా విజయం సాధించారు. ఆయన జూన్‌లో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు సభ ప్రారంభం కాగానే ఆయన ప్రమాణం చేశారు.