లైంగికదాడుల నిందితులను కఠినంగా శిక్షించాలి • కాంగ్రెస్ నాయకుల డిమాండ్ దౌల్తాబాద్, జూన్ 11, జనంసాక్షి

జుబ్లీహిల్స్ లైంగిక దాడి నిందితులను కఠినగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు. నగరంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని. అఘాయిత్యాలు. దారుణాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు.
విశ్వనగరమని మంత్రులు గొప్పలు చెప్పుకునే హైదరాబాద్లో మహిళలకు ఏమాత్రం రక్షణలేకుండా పోయిందన్నారు. ఏరులైపారుతున్న మద్యం, గుడుంబాతోపాటు పోర్న్ వెబ్సైట్లలో యువత పెడదారులు పడుతుందన్నారు. ఒకవైపు కులదురంహకార హత్యలు, మరోవైపు లైంగికదాడులు, ఇంకోవైపు గృహహింస కేసులు. పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మద్దెల స్వామి,పిట్ల రాజు,పంజా రమేష్,యాదవ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.