చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత దౌల్తాబాద్, జూన్ 11 జనంసాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో గల ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంద సుధాకర్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవలే ఆత్మ హత్య చేసుకున్నాడు అనే విషయం తెలిసి అతనికి భార్య భూలక్ష్మి,కొడుకు రేవంత్, తల్లిదండ్రులు సత్తయ్య,బాల్ నర్సమ్మ లకు 3500 రూపాయల విలువ గల నిత్యా వసర సరకులు మరియు 6500 రూపాయలు నగదు ను అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆధ్వక్షులు గుర్రం తులసీదాస్, కోశాధికారి దోంతుల ఆనంద్,జనరల్ సెక్రెటరీ మంగిలిపల్లి కిరణ్ కుమార్ మరియు సభ్యులు టెంట్ నర్సింలు, చేపూరిసంతోష్ కుమార్ లు పాల్గొన్నారు