లైసెన్స్ లేని బెల్ట్ షాపు నిర్వాహకులకు హెచ్చరిక..

రాయికల్,అక్టోబర్ 13 (జనంసాక్షి) పట్టణంలోని ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న స్థావరాలపై కచ్చితమైన తనిఖీలు చేపడుతున్నామని రాయికల్ ఎస్సై అజయ్ అన్నారు, తనిఖీలో కనుక మద్యం పట్టుబడితే వాటిని జప్తు చేయడమే గాక, ఆలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని మరియు అలాంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.