– ఈ నెలాఖరుకు షెడ్యూల్ వచ్చే అవకాశం
– రాహుల్, మోదీకి మధ్యే ఎన్నికల పోరు
– నియోజకవర్గాల వారీగా సవిూక్షల జరుపుతాం
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి12 (జనంసాక్షి) ప్రతీ ఒక్క కార్యకర్త లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ఐక్యంగా కృసి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన డీసీసీ అధ్యక్షులు, మండల, జిల్లా నాయకులతో టెలీకాన్ఫరెన్స్
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సమయం తక్కువగా ఉందని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపిచ్చారు. రాహుల్, మోదీకి మధ్యే ఈ ఎన్నికలంటాయని ఉత్తమ్ అన్నారు. ఎన్నికల హావిూలు అమలు చేయడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదల అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రగతి దిగజారిపోయిందన్నారు. మైనార్టీలను అభద్రతాభావంలోకి నెట్టారని ఆయన విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోయిందని, రాహుల్ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తారని ఉత్తమ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాలవారీగాసవిూక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు ఈనెల 14వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 15న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్‌లలో, 16న నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, 17న మెదక్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలపై సవిూక్ష జరుపుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని, ఈ రెండు నెలలు కష్టపడి పనిచేయాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వండి




