Tuesday, 3 November 2026

సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి

వీణవంక జనవరి 3 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలో విద్యా రాణిగా మొదటి ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎదిగి భారత విద్యా రంగ చరిత్రలో నిలిచారన్నారు. భారత దేశ ఆనాటి సామాజిక వ్యవస్థలైన వర్ణ వ్యవస్థలో అణచివేత, అవమానం, మహిళల దాష్టికం నుండి చైతన్యవంతమైన విద్యా దీప్తిగా ఎదిగి నేటి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు ఆదర్శవంతమయ్యారన్నారు దేశ ప్రగతికి ఎన్నో సంస్కరణలు విద్య ద్వారానే మహిళ సాధికారత సాధించవచ్చు అని భావించి బలహీన బడుగు వర్గాల బ్రతుకుల్లో వెలుగు నింపటానికి పాఠశాలను ప్రారంభించి విద్యా దివ్వెలను అందించి దేశానికి వారు సేవలు అందించారన్నారు. వారి ఆదర్శవంతమైన కుటుంబ జీవితం భారతదేశం మహిళా సాధికారత, సాధించుటలో ముందడుగు వేసిందని అని చెప్పవచ్చు అని, ప్రతి విద్యార్థిని చదువులో ముందుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివి ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ పిఆర్టియు తెలంగాణ బాధ్యులు కర్ణాకర్ రెడ్డి పిఆర్టియు తెలంగాణ బాధ్యులు తిరుపతి రెడ్డి ఎస్టియు బాధ్యులు బాలాజీ ఎస్టియు బాధ్యులు విజయ పాల్ రెడ్డి టీపస్ బాధ్యులు శివకుమార్ డిటిఎఫ్ బాధ్యులు శ్రీనివాస్ పాఠశాల మండలంలోని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు