వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధించాలి
గుడిహత్నూర్ : డిసెంబర్, 31( జనం సాక్షి)పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు గుడిహత్నూర్ మండలంలోని తోషం గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని తరగతి గదులను ఆయన పరిశీలించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకొని వారి కలలను తీర్చానన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన ప్రధానోపాధ్యాయుడు అభిమాన్ కు సూచించారు.విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విద్య బోధన చేయాలని,విద్యాబోధన సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనక అభిమాన్ ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.




