సూర్యాపేట,అక్టోబర్19(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చిత్తుకాక తప్పదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేవలం అధికరా టిఆర్‌ఎస్‌ను గద్దెదింపే లక్ష్యంతో అన్ని పార్టీలు జతకట్టాయన్నారు. వారికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. శుక్రవారం మంత్రి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దేవాలయం అభివృద్ధికి మంత్రి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు. కేంద్ర జలవనరుల సంఘం మాజీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు అభ్యర్థన మేరకు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. ఆర్ విద్యాసాగర్‌రావుది అర్వపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. పలుమార్లు సీఎం కేసీఆర్ కూడా దేవాదాయ శాఖాధికారులతో ఆలయ అభివృద్ధిపై సవిూక్షించారు. అభివృద్దిలో ముందుకు పోతున్న క్రమంలో కాంగ్రెస్ అడ్డుకుంటోందని, అందుకే ఎన్నికల సవాల్ విసిరామని మంత్రి అన్నారు. ఇక ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి చిత్తుకాక తప్పదు: మంత్రి




