వచ్చే ఎన్నికల్లో భాజపా జెండా ఎగుర వేస్తాం.
నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి.
జనం సాక్షి, భైంసా రూరల్ నవంబర్ 29
వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారం లోకి వస్తుంది అని నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు.మంగళవారం
5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బైంసా పట్టణంలోని గణేష్ ఫ్యాక్టరీ లో జరుగగా సభలో మాట్లాడుతూ…ప్రజల కోసమే ప్రజా సంగ్రామ యాత్రఅని,పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని, అవి మేనిఫెస్టోలో పెట్టడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
భయంతోనే భైంసా పట్టణంలో బహిరంగ సభను జరగకుండా కేసీఆర్ అడ్డుకున్నాడని,మన దేవుళ్లను, దేవతలను కించపరిచిన మునావర్ ఫారూఖీ అనె కమెడియన్ కు ఎలా అనుమతి ఇస్తారని,బై0సా సభకు మాత్రం సెన్సిటివ్ ప్రాంత అని అనుమతి ఎందుకు ఇవ్వరని మండి పడ్డారు.ఇక్కడ హిందువులను ఇబ్బంది పెడుతున్నారని,ఇండ్లు తగలబెట్టారని,అయినా బాద్యులపై చర్యలు లేవని, బాధితుల పైనే కేసులు నమోదు చేశారన్నారు.




