Wednesday, 4 November 2026

వచ్చే ఖరీఫ్‌కు 30 వేల ఎకరాలకు సాగునీరు… సీడీఓ సీఈ గిరిధర్ రెడ్డి

విజయనగరం : : తోటపల్లి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌కు కొత్త ఆయకట్టు ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్(సీడీఓ సీఈ) గిరిధర్ రెడ్డి తెలిపారు. బుధవారం తోటపల్లి ప్రాజెక్టు, కుడి ప్రధాన కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్‌ఈ డి. తిరుమలరావు, సీఈ హెచ్. మన్మథరావులను ప్రాజెక్టుకు సంబంధించిన వచ్చే ఖరీఫ్‌కు 30 వేల ఎకరాలకు సాగునీరు…!

వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆదేశాల మేరకు తోటపల్లి ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇంతవరకు రూ. 500 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు 117 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 200 స్ట్రక్చర్లు , 32 డిస్ట్రిబ్యూషన్ చానళ్ల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాత ఆయుకట్టు 64 వేల ఎకరాలతో పాటు కొత్త ఆయకట్టు 1. 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  ప్రాజెక్టు పరిసరాల్లో నాగావళి ఒడ్డులు కోతకు    గురికాకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీరింగ్ చీఫ్ బి.సత్యనారాయణ రెడ్డి, నార్త్‌కోస్ట్ సీఈ శివరాం ప్రసాద్, డీఈఈలు ఎస్.పాండు, ఎవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *