భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
సూర్యాపేట,జనవరి19(జనంసాక్షి): వచ్చే నెల 24నుంచి 28వరకు ఐదురోజుల పాటు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర జరుగనేఉంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సవిూక్షించారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ అధికారులతో చర్చించి పలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 10న దిష్టిపూజ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి వాటికి నల్లాలు బిగించి ఎప్పటికప్పుడు నీటి సరఫరా అందేలా చూడాలని చెప్పారు. భద్రతకు సాంకేతికను ఉపయోగించుకోవాలని సూచించారు. జాతర ప్రాంగణాన్ని 8జోన్లుగా విభజించి 20మంది పంచాయతీ సెక్రెటరీలను నియమించాలన్నారు. ఒక్కో జోన్ ముగ్గురు చొప్పున పంచాయతీ సెక్రెటరీలను నియమించి ఎప్పటి కప్పుడు పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జాతరలో సేకరించిన చెత్త, ఇతర వస్తువులను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గతంలో మంజూరు చేసిన పనులను నేటి వరకు పూర్తి చేయకపోవడంపై సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.




