Wednesday, 4 November 2026

వడగల్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ రూరల్ మార్ట్ 25 జనం సాక్షి
వడగళ్ల వల్లే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం జడ్పీ చైర్ పర్సన్ *సునితా మహేందర్ రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యేకొప్పుల మహేష్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి సమీపంలో గల డిపిఆర్సి లో ఏర్పాటుచేసిన వికారాబాద్ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం లో పాల్గొన్నారు.ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సిపిఆర్ నొప్పి వచ్చినప్పుడు తీసుకొను జాగ్రత్తలు పై అవగాహన కల్పించారుసమావేశంలో ప్రతిసారి మాదిరిగా కాకుండా అన్ని శాఖల అధికారులు మాట్లాడే క్రమాన్ని మారుస్తూ ఉండాలని, సూచించారు.ఆన్లైన్ లో నమోదు చేసుకోలేనటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.సదరం క్యాంపులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, సదరం క్యాంపు నిర్వహిస్తున్న సమయంలో గ్రామీణ ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారుధారూర్ మండల పరిధిలోని దోర్నాల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్ల పై రైతులు పంటపొలాల్లోకి పైపులు కనెక్షన్ కోసం రోడ్డు తవ్వి వాటిని అలాగే వదిలేయడం జరుగుతుందని, వాటిని ఎప్పటికప్పుడు ముసివేయాలన్నారు, నూతనంగా రోడ్లు వేసిన మార్గంలో బ్రిడ్జిల వద్దా ప్యాచ్ వర్క్ మిగిలిపోయినవాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.పాత కలెక్టర్ కార్యాలయం నుండి మద్గుల్ చిట్టెంపల్లి మధ్యలో ఉన్న కల్వర్టు వద్దా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, త్వరగా కల్వర్టు నిర్మాణం చేయాలన్నారు.అనంతరం జిల్లాలోని *ఉత్తమ గ్రామపంచాయతీలకు, 2023 జాతీయ పంచాయతీ అవార్డులు వికారాబాద్ జిల్లా కు 27 రాగ అందులో వికారాబాద్ నియోజకవర్గానికి 10 రావడం జరిగిందని వారిని అభినందిస్తూ.అవార్డులు అందజేశారు.జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా విద్యాధికారి రేణుక రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు చీమలదరి సర్పంచ్ నాసన్పల్లి నరసింహారెడ్డి ఫుల్ మద్ది సర్పంచ్ సుభాన్ రెడ్డిరాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు మోమిన్ పేట మండలంలోని గోవిందపూర్ ఎన్ కసల గ్రామపంచాయతీలకు ఉత్తమ పంచాయతీలుగా అవార్డు అందుకున్నారు కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ రెడ్డి సత్తయ్య ఎంపీఓ నాగరాజు మనోహర్ ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.