Thursday, 5 November 2026

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

వడ్డెర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మల్లపు లక్ష్మణ్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 5. (జనంసాక్షి). వడ్డెరలను బీసీ ఏ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మల్లపు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ వడ్డెర డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న వడ్డెరల అభివృద్ధి మాత్రం శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెరలను బీసీ ఏ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. వడ్డర్ల డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేరియనునట్లు తెలిపారు. సమావేశంలో వెంకటేశం, దండుగల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు