Saturday, 7 November 2026

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితా లో చేర్చాలి

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితా లో చేర్చాలి..
బేల, నవంబర్ 28 ( జనం సాక్షి ) వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితా లో చేర్చాలని సోమవారం మండల తహశీల్దార్ బడాల రాంరెడ్డి కి పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు ఉప్పల్ వార్ నారాయణ మాట్లాడుతూ వడ్డెర కులస్తులలో చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.బిసి నుండి తొలగించి ఎస్టీ జాబితా లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సభ్యులు ఉప్పల్ వార్ భుజంగ్ రావ్, రాందాస్,నాగొరావ్, రమేష్,మరోతి , గణేష్ తదితరులు పాల్గొన్నారు..