Saturday, 7 November 2026

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి.
తాండూరు అభివృద్ధికి ఎన్ని నిధులైన తీసుకువస్తా
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు నవంబర్ 28 (జనం సాక్షి)
సీఎం కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి గ్రామ సమీపంలోని జిపిఆర్ గార్డెన్లో ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తాండూర్ నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలు బషీరాబాద్, తాండూర్, పెద్దేముల్ ,యాలాల్ మరియు తాండూరు మున్సిపాలిటీ లోని వార్డులకు చెందిన 234 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ నియోజకవ ర్గానికి ఎన్ని నిధులైన తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు అని,కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బాగుండేదని కోరుకుంటున్నా రని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్‌, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు, పెద్దేముల్ జెడ్పిటిసి ధారాసింగ్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, యాలాల్ ఎంపీపీ బాలేశ్వర గుప్తా, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, తాండూర్ ఎమ్మార్వో చిన్నప్పల నాయుడు, పెద్దేముల్ ఎమ్మార్వో విద్యాసాగర్ రెడ్డి, పెద్దేముల్ ఆర్ఐ రాజిరెడ్డి, తాండూరు ఆర్ఐ రాజిరెడ్డి, బషీరాబాద్ ఆర్ఐ భాగ్యలక్ష్మి, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పెద్దేముల్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్, కందనెల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి, మదనంతాపూర్ సర్పంచ్ గోవర్ధన్, అడికిచర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మారేపల్లి తండా సర్పంచ్ పాండు, ఊరెంటి తండా సర్పంచ్ తోప్యానాయక్, మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్, ఖానాపూర్ సర్పంచ్ నర్సింలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.