– పిల్లల కిడ్నాప్ ముఠాలు ఏవిూలేవు
– వదంతులను నమ్మి వ్యక్తులపై దాడి చేయకండి
– విశాఖ సీపీ యోగానంద్
విశాఖపట్టణం, మే21(జనం సాక్షి) : పిల్లల కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయన్న వదంతుల్ని నమ్మొద్దని విశాఖ నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ అన్నారు. విశాఖలో ఈ వదంతులు నమ్మి కొందరు వ్యక్తులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో ఏర్పాటుచేసిన విూడియా సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులుంటే వాట్సాప్ నం. 9493336633తో పాటు 0891 2565454 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమానంతో వ్యక్తులపై దాడులు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. సామూహికంగా దాడిచేసి ఓ వ్యక్తిని చంపిన ఘటన బాధాకరమన్నారు. దాడిచేసినవారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తున్నామని వివరించారు. వదంతుల నేపథ్యంలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇలాంటి వదంతుల్ని వ్యాప్తి చేస్తున్నవారి సమాచారం సేకరిస్తున్నామని సీపీ అన్నారు.వాట్సాప్, ఫేస్బుక్ కార్యాలయాలకు వదంతులు వ్యాప్తి చేస్తున్న వారి సమాచారం కోరుతూ లేఖలు రాసినట్టు చెప్పారు. సమాచారం ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టంచేశారు. పోలీసుల పహారా పెరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే దొంగలు ఇళ్లల్లో చొరబడి సొత్తు దోచుకోవడంతో పాటు మనషులపై దాడులు చేస్తున్నారని, చిన్న పిల్లలను అపహరించి హత్యలు చేస్తున్నారన్న వదంతులు వాట్సాప్ గ్రూపుల్లో వ్యాప్తి చెందటంతో కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. గన్నవరం, బాపులపాడు, ఉంగటూరు మండలాల్లో గ్రామస్తులు కంటివిూద కునుకు లేకుండా కర్రల, మారణాయుధాలు చేత పట్టుకుని అర్ధరాత్రి సమయాల్లో కాపలా కాశారు. ముఖ్యంగా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామస్తులు ఈ వదంతులతో మరింతగా భయపడుతున్నారు. గత మూడు రోజుల నుంచి అరబయట అరుగులపైనే పిల్లా పాపలతో సహా కాపలా కాస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అందోళనకు గురవుతున్నారు. గన్నవరం మండలం బుద్ధవరం, ముస్తాబాద్ బాపులపాడు మండలం పెరికీడు వీధుల్లో అనుమానంగా సంచరిస్తున్న
గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. బంధువులు, తెలిసినవారు, గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి నిమిషానికి సమాచారం పెట్టడం, విూ పిల్లలు, విూరు జాగ్రత్తగా ఉండడని పదే పదే ఫోనులు చేస్తుండటంతో భయమేస్తోందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వందతులపై పోలీసులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ వందతులేనని స్పష్టం చేశారు.
————————–




